Lavanya Tripathi Gives Clarity On Affair Rumours With Varun Tej: గతంలో ఓసారి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ ప్రచారం జరిగింది. దానిపై ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు చర్చలు జరిగాయి కూడా! ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలిపోవడంత్.. అంతా లైట్ తీసుకున్నారు. అయితే.. రీసెంట్‌గా ఓ మెగా ఈవెంట్‌లో వరుణ్, లావణ్య కలిసి కనిపించడంతో.. మరోసారి వాళ్లు ఎఫైర్‌లో ఉన్నారనే రూమర్లు ఊపందుకున్నాయి. తాజాగా వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది లావణ్య. వరుణ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.
‘‘వరుణ్ తేజ్‌తో కలిసి నేను రెండు సినిమాల్లో నటించా. ఆమాత్రం దానికే లింకులు పెట్టేస్తారా? అసలు ఈ పుకారు వినడానికే అదోలా ఉంది. ఒకసారైతే.. నేను అతనితో సహజీవనం చేస్తున్నానని కూడా వార్తలు రాసేశారు. అది చూసి నేను నిజంగా షాక్‌కి గురయ్యాను. అలాంటి వార్తలు అసలెలా రాస్తారు? ప్రస్తుతానికైతే నేను సింగిలే. ఎవరితోనూ ప్రేమలో లేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను నేను నమ్మను. అంత ఈజీగా ఓ వ్యక్తితో ప్రేమలో పడలేను. నాకంటూ కొంత సమయం కేటాయిస్తేనే.. ఎదుటివాడు ఎలాంటి వ్యక్తో తెలుసుకొని, అప్పుడు ముందడుగు వేస్తా’’ అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. సో.. ఇక్కడితో లావణ్య, వరుణ్ ప్రేమలో ఉన్నారన్న రూమర్స్‌కి టోటల్‌గా ఫుల్ స్టాప్ పడినట్టే!
ఇక ఇదే సమయంలో జయాజయాల్ని తాను ఎలా రిసీవ్ చేసుకుంటానన్న విషయాలపై లావణ్య చెప్పుకొచ్చింది. మొదట్లో తాను విజయాల్ని సెలెబ్రేట్ చేసుకునేదాన్ని కాదని, తరర్వాత అది తప్పని తెలుసుకొని విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టానని తెలిపింది. సక్సెస్‌ను ఇతరులతో పంచుకుంటేనే, ఆ ఆనందం రెట్టింపవుతుందని తనకు ఆలస్యంగా అర్థమైందని చెప్పింది. ఇక ఫ్లాపుల్ని తాను మరీ వ్యక్తిగతంగా తీసుకోనని వెల్లడించింది. తనకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారని.. కానీ తనకు క్లబ్బులకు, పబ్బులకు తిరగడం ఏమాత్రం ఇష్టం ఉండదని లావణ్య పేర్కొంది.