టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఘోర అవమానం జరిగింది. ఒక ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ కు వెళ్లిన అతనిని ప్రముఖ యాంకర్ స్టూడియో నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మే 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విశ్వక్ నడిరోడ్డుపై ఒక యువకుడితో కలిసి ప్రాంక్ వీడియో చేయడం, అది కాస్తా వైరల్ అయ్యి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిపోయాయి. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్,పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వక్ పై న్యూసెన్స్ కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ వివాదంపై చర్చించడానికి ఒక ప్రముఖ టీవీ ఛానెల్ విశ్వక్ సేన్ డిబేట్ కు పిలిచింది. ఇక ఆ డిబేట్ లో ప్రముఖ యాంకర్ , హీరోను ఇలాంటి పనులు ఎలా చేస్తారు.. మీరు పాగల్ సేన్ , డిప్రెస్డ్ పర్సన్ అంటూ మాట్లాడింది.
ఇక ఆ మాటలకు హార్ట్ అయిన విశ్వక్ యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అలాంటి మాటలు అనొద్దని, తనకు నచ్చదని.. అర్ధం చేసుకోమని, మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గట్టిగా చెప్పాడు.. ఇక దీంతో ఆ యాంకర్ గెట్ అవుట్ మై స్టూడియో అంటూ గట్టిగట్టిగా అరుస్తూ చెప్ప్పుకొచ్చింది. ఇక మరోపక్క విశ్వక్ కూడా ఆమెను అసభ్యపదజాలంతో మాట్లాడుతూ మీరు ఇంటర్వ్యూ కి పిలిచి, మీరే నన్ను మాటలు అంటున్నారని చెప్పుకొచ్చాడు. అయినా యాంకర్ ఆగకుండా హీరోను వెధవ అని తిడుతూ నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరవడం సంచలనం సృష్టిస్తుంది. ఇక చివర్లో నా గురించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి అంటూ విశ్వక్ మైక్ విసిరి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది కూడా ప్రాంక్ లో భాగమే అని కొందరు అంటుండగా.. మరికొందరు ఒక ఛానెల్ లో, అది లైవ్ లో ఇలా అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గు లేదా మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.