Site icon NTV Telugu

The Warriorr: ఆ సమస్యతో బాధపడుతున్న హీరో రామ్..

Ram

Ram

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా.. విలన్ గా యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో రామ్ మతిమరుపు ఉన్న పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట.. దాంతో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అని తెలుస్తోంది. ఇక చివరికి ఒక కేసులో ఈ మతిమరుపు వలన రామ్ చేసిన పొరపాటు ఏంటి..? దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు అనేది కథగా తెలుస్తోంది. ఇక కామెడీ చేయడంలో రామ్ రూటే వేరు.. రెడీ, కందిరీగ చిత్రాల్లో రామ్ కామెడీ అల్టిమేట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ ఏ విధంగా కామెడీ చేస్తాడో చూడాలి..

Exit mobile version