Site icon NTV Telugu

Taapsee Pannu: పెళ్లి పీటలు ఎక్కనున్న తాప్సీ.. వరుడు అతడేనంట

taapsee

taapsee

ఝమ్మంది నాదం చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన ముద్దుగుమ్మ తాప్సీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇక్కడ కుదరదు అనుకోని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి అక్కడే పాగా వేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలకు బెస్ట్ ఛాయిస్ అని బాలీవుడ్ డైరెక్టర్ల చేత అనిపించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నదట. అమ్మడు గతకొన్నిరోజులుగా బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సందు చిక్కినప్పుడల్లా ఇద్దరు టూర్లు, వెకేషన్లు నాటు కనిపిస్తూనే ఉన్నారు.

ఇక బాలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారట. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించడమే కాకుండా వివాహ ముహుర్తాన్ని కూడా నిర్ణయించేశారట. త్వరలోనే అధికారికంగా తాప్సీ పెళ్లి ప్రకటన రానున్నదట. ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యూక్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ మస్తు బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తరువాత తెలుగులో `మిషన్ ఇంపాజిబుల్’ లో కనిపిస్తుంది.

Exit mobile version