చిత్ర పరిశ్రమలో ఎవరి రాత ఎప్పుడు మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. హిట్ కాదు అనుకున్న సినిమా ఒక్కోసారి భారీ విజయాన్ని అందుకుంటుంది.. భారీ అంచనాలను పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. చిన్న హీరోలను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలను చేస్తోంది.. విజయ్ దేవరకొండ, యశ్.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలుగా మారినవారు.. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ.. చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో డీజే టిల్లు హిట్ తో ఒక్కసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. ఈ ఒక్క హిట్ తో సిద్దు బలుపు చూపిస్తున్నాడని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ఇక తాజగా ఈ హీరో కొద్దిగా హద్దులు కూడా దాటినట్లు సమాచారం.
తానూ తీయబోయే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తనతో చెప్పాలని, కథ, కథనం, మాటలు.. అన్నీ తన కనుసన్నల్లోనే నడవాలనే కండిషన్లు పెడుతున్నాడట. దీంతో నిర్మాతలతో పాటు డైరెక్టర్లు షాక్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. డీజే టిల్లు సినిమాకు సిద్ధునే డైలాగ్స్ రాసిన విషయం విదితమే. ఇక అదే తరహాలో తన ప్రతి సినిమాలో తన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉండాలని అంటున్నాడట. దీంతో డైరెక్టర్లు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక మరికొందరు హిట్ కొట్టింది ఒక్క సినిమా.. దాన్ని అడ్డుపెట్టుకొని ఇంతలా బలుపు చూపడం సిద్దు కెరీర్ కు మంచిది కాదని కొందరు హితబోధ చేస్తున్నారట. ఈ సినిమా హిట్ టోన్ కప్పెలా రీమేక్ లో నుంచి తప్పుకున్న విషయం విదితమే. ఏదిఏమైనా యెంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి అని కొందరు.. కెరీర్ ను ప్లాన్ చేసుకోవడంలో తన నిర్ణయాలు తను తీసుకొంటున్నాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.