Site icon NTV Telugu

Pooja Hegde: ఐటమ్ కోసం పూజకు కోటి

Pooja Hegde

Pooja hegde

దక్షిణాది అగ్రహీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అమ్మడి కోసం ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పూజ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పూజహేగ్డే కూడా తనకు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తోంది. రాబోయే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చిన్న పాత్రలో కూడా కనిపించనుంది.
ఇదిలా ఉంటే ‘ఎఫ్‌3’లో స్పెషల్ సాంగ్ కోసం దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారట. అయితే ఈ పాట చేయటానికి 1.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. చివకు కోటికి బేరం సెటిల్ అయినట్లు వినికిడి.

‘రంగస్థలం’లో సూపర్ హిట్ ఐటమ్ చేసిన పూజ త్వరలో ‘ఎఫ్3’ ఐటమ్ సాంగ్ షూటింగ్ లో పాల్గొనబోతోందట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 27న దీనిని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఐటమ్ కూడా పూజకు పేరు తెస్తుందేమో చూడాలి.

Exit mobile version