Site icon NTV Telugu

KGF 2 : సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ ఆమెనట..

Raveena

Raveena

ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం కెజిఎఫ్ 2.  కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో కెజిఎఫ్  హీరో ఎలివేషన్లను చూపించాడు డైరెక్టర్.  నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టింది ఈ సినిమా. ఇక రాఖీభాయ్ యష్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యష్ నటన ఎలా ఉంటుంది అనేది చాప్టర్ 1 లో చూసేశాం. ఇక తాజాగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో కొత్తగా చేరిన సంజయ్ దత్, రవీనా టాండన్ గురించి.. ఒక వైపు కేజీఎఫ్ ను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోవాలని చూసే అధీరా పాత్రలో సంజయ్ దత్.. మరోవైపు రాఖీకి అడ్డుకట్ట వేయాలని చూసే ఇందిరాగాంధీ తరహా రాజకీయ నేత పాత్రలో రవీనా టాండన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. మరీముఖ్యంగా సినిమా మొత్తానికి  సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్  .. రవీనా టాండన్ అని అంటున్నారు ప్రేక్షకులు.

రాజకీయ నేత రమిక సేన్ గా ఆమె నటన ఆకట్టుకుంటుందని, రాఖీ భాయ్  కి, ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. రవీనాకు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. బాలీవుడ్ సినిమాల్లో రవీనా ఛాలెంజింగ్ పాత్రలు ఎన్నో చేసి మెప్పించింది. పాత్రకు తగ్గట్టే ఆమె నటించి మెప్పించింది. ప్రశాంత్ నీల్ సైతం పాత్రలకు తగ్గట్టే క్యాస్టింగ్ ఎంచుకోవడం సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. ఇక సంజయ్ దత్ సైతం ఇంటర్వ్యూలో తనకు రవీనా టాండన్ నటన చాలా బాగా నచ్చిందని, ఆమె చేసిన నటన చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. దీంతో ఆమె పాత్రపై హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నట్లుగానే ఆమె నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇంకోపక్క సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేదని అంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 లో ఎటువంటి స్టార్లు లేకపోయినా కథే బలంగా ఉందని, చాప్టర్ 2లో స్టార్లు ఉన్నా కథ అంత బలంగా లేదని చెప్పుకొస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు పేలవంగా అనిపించాయని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version