‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు ‘దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు’ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మూవీకి మళ్ళీ సంగీతం అందిస్తున్నాడు. విశేషం ఏమంటే… శుక్రవారంతో ‘సర్కారు వారి పాట’ మూవీ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తయినట్టు తమన్ తెలిపాడు.
Read Also : వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!
Also Read
మహేశ్ బాబుతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ సంగతి చెప్పాడు. ఎస్. తమన్ కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 2022 సంక్రాంతి బరిలో తమన్ తన సినిమాతో తానే పోటీ పడబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీకి కూడా తమనే స్వరకర్త. అలానే ‘సర్కారు వారి పాట’ ఆ మర్నాడే 13న జనం ముందుకు రాబోతోంది. మరి ఈ రెండు సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసి, అదే విధంగా తన సంగీతంతో విజయపథంలోకి తమన్ తీసుకెళ్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!