వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ మొత్తానికి తొలి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. గత శుక్రవారం విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా అమెరికాలోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ – ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో పాటు కథానాయిక పూజా హెగ్డే కు ఉన్న స్టార్ ఇమేజ్ సైతం ఈ మూవీ ఓపెనింగ్స్ కు బాగా ఉపయోగపడింది.

Read Also : ఆస్కార్ ఇండియన్ ఎంట్రీ షార్ట్ లిస్ట్ లో యోగిబాబు ‘మండేలా’!

అక్కినేని నాగ చైతన్యకు ‘100 % లవ్’తో చక్కని విజయాన్ని అందించిన గీతా ఆర్ట్స్ సంస్థ, అతని తమ్ముడు అఖిల్ కూ తొలి విజయాన్ని అందించడం ఓ విశేషం. ఆ చిత్రానికి దర్శకుడు సుకుమార్ నిర్మాణ భాగస్వామి కాగా, ఈ సినిమాకు మరో దర్శకుడు వాసు వర్మ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కావడం మరో విశేషం. మొత్తానికీ అఖిల్ కు విజయం దక్కాలనే అక్కినేని వంశాభిమానుల చిరకాల కోరికను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తీర్చేసింది. ఇక ఈ యేడాది చివరిలో ‘ఏజెంట్’గా రాబోతున్న అఖిల్ ఇదే ఊపులో మరో విజయాన్ని పొందుతాడేమో చూడాలి.

Related Articles

Latest Articles