ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు.
అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా భోస్లే మీడియా ముందు ఒక కీలక ప్రకటన చేశారు. ” లతా అక్క ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు” అని చెప్పుకొచ్చారు. ఇక ఆశా మాటలతో లతా ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. దీంతో అభిమానులు కొద్దిగా ఊపిరి తీసుకొంటున్నారు. ప్రస్తుతం బ్రీచ్ కాండీ ఆసుపత్రి వద్ద పోలీసుల సెక్యూరిటీ భారీగా పెంచేశారు. తమ అభిమాన గాయని హాస్పిటల్లో ఉందని అభిమానులు భారీ ఎత్తున హాస్పిటల్ కి చేరుకొంటున్నారు.
