దీపావళి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ “భీమ్లా నాయక్” నుంచి సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “లాలా భీమ్లా” సాంగ్ ప్రోమో కేవలం 40 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రోమో స్టార్టింగ్ నుంచే యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలు ఉండడం, పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు సరికొత్త స్టైల్ లో చెప్పడం మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
“లాలా భీమ్లా” ప్రోమో వీడియో విడుదలైన 12 గంటల్లోనే యూట్యూబ్‌లో దాదాపు 3.5 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. ఈ వీడియో దాదాపు 370 కే లైక్‌లను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేసే దిశగా పరుగులు తీస్తోంది. అయితే ఒక సాంగ్ ప్రోమోకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అనేది విశేషమే. ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ చెప్పిన ‘క్రాకర్ ఆఫ్ ఎ పోస్టర్’ పైనే అందరి దృష్టి ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సైతం ఆసక్తికరంగా ఉంది. మరోవైపు ‘లాలా భీమ్లా’ పాట నవంబర్ 7న విడుదల కానుంది.
Read also : “లైగర్” దీపావళి స్పెషల్ గా మైక్ టైసన్ లుక్ రిలీజ్
టాలెంటెడ్ యంగ్ మలయాళ భామలు నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సరసన నటిస్తున్నారు. “భీమ్లా నాయక్” చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ సౌండ్‌ట్రాక్ అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రాశారు. “భీమ్లా నాయక్” చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.