Laggam Shooting Update: సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రమేష్ చెప్పాల మాట్లాడుతూ మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మాట్లాడుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ సినిమా కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందన్నారు.
సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్ గా నటిస్తున్న లగ్గం సినిమాలో రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి సీనియర్ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి, అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకులు రమేష్ చెప్పాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్:కృష్ణ సాహిత్యం: కాసర్ల శ్యామ్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎల్ బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.