రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న మూవీ ‘ఖుషి’. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. గత కొన్ని నెలలుగా మీడియాకి, అభిమానులకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత… ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి అభిమానులని ఖుషి చేసింది. ఈ ఈవెంట్ తో ఖుషి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లని కూడా కలిసి ఖుషి సినిమాకి ప్రమోషన్స్ చేసింది సమంత. ఇక విజయ్ దేవరకొండ సౌత్ టూర్ తో ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తుంటే సమంత మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్ళిపోయింది. ఇటీవలే న్యూయార్క్ వెళ్లిన సమంత, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కనిపించట్లేదు.
ఖుషి సినిమాని విజయ్ దేవరకొండ ఇండియాలో ప్రమోట్ చేస్తూ ఉంటే సమంత ఓవర్సీస్ మార్కెట్ లో చేస్తున్నట్లు ఉంది. సమంత ఎక్కడికి వెళ్లినా హ్యుజ్ క్రౌడ్ వస్తున్నారు. వాళ్లందరినీ కలిసి సమంత న్యూయార్క్ లో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా సమంత ఫొటోస్ సోషల్ మీడియాలో బయటకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ లో సమంత పోస్ట్ చేసిన ఫొటోస్ సూపర్బ్ గా ఉన్నాయి. స్టైలిష్ ఎట్ ట్రెడిషనల్ గా కనిపిస్తున్న సామ్, షార్ట్ హెయిర్ లో చాలా బాగుంది. ఇలానే సమంత సెప్టెంబర్ 1 వరకూ పబ్లిక్ లో ఉంటే ఖుషి సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే చాలు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురికీ హిట్ పాడడం గ్యారెంటీ. ఇప్పటికే సాంగ్స్ చార్ట్ బస్టర్ అయ్యాయి కాబట్టి సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు అందరూ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లే.