NTV Telugu Site icon

Kushi: మ్యూజిక్ లవర్స్‌కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?

Kushi Second Single

Kushi Second Single

Kushi Second Single To Release On July 12: విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఇదివరకే ఒక పాటని విడుదల చేసి, ప్రేక్షకులకు మెలోడియస్ ట్రీట్ ఇచ్చింది. ‘నా రోజా నువ్వే’ అనే పాట ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ.. ఈ పాటే తెగ చక్కర్లు కొడుతోంది. మ్యూజిక్ లవర్స్ అయితే దీనిని లూప్‌లో వింటున్నారు.

Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్

ఇప్పుడు ‘ఖుషీ’ మేకర్స్ మరో మెలోడియస్ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్‌ని తాజాగా ఇచ్చారు కూడా! ‘ఆరాధ్య’ అనే సాంగ్‌ను జులై 12వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో విజయ్, సమంత ఎదురెదురుగా కూర్చొని.. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని నవ్వులు చిందిస్తూ.. రొమాంటిక్ పోజ్‌లో క్యూట్‌గా కనువిందు చేశారు. తొలుత జులై 10న ప్రోమోను, ఆ తర్వాత ఫుల్ సాంగ్‌ను జులై 12న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు.. లూప్‌లో వినేలా ఈ మెలోడియస్ సాంగ్ ఉంటుందని, ‘నా రోజా నువ్వే’ పాట తరహాలోనే దీనికి అడిక్ట్ అవ్వడం ఖాయమంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెప్పారు. మరి, ఈ పాట ఆ రేంజ్‌లో ఉంటుందో లేదో చూడాలి.

Project K Merchandise: ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి

ఈ సెకండ్ సింగిల్‌ని తెలుగు తమిళ భాషల్లో సిడ్ శ్రీరామ్, చిన్మయీ శ్రీపాద పాడగా.. తెలుగు వర్షన్‌కి శివ నిర్వాణ, తమిళ వర్షన్‌కి మదన్ కార్కి సాహిత్యం అందించారు. ఇక హిందీ వర్షన్‌లో జుబిన్ నోటియాల్, పలక్ ముంచల్ తమ గాత్రం అందించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.