Project K Merchandise: ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Project K Unit Released What Is Project K Merchandise For Fans: మన భారతీయ చిత్రసీమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాభ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పతాని వంటి భారీ స్టార్‌కాస్ట్‌తో.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తొలుత పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ, ఇప్పుడిది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. అలాంటప్పుడు అంచనాలు మామూలుగా ఉంటాయా? బహుశా తారాస్థాయి అనే మాట కూడా చిన్నదే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అంటూ కళ్లు కాయలు కాచేలా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. చిత్రబృందం కూడా అప్పుడప్పుడు క్రేజీ అప్డేట్స్‌తో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తోంది.
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Also Read
- Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
- Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
జులై 20వ తేదీన శాన్‌డియాగో కామికాన్ వేడుకలో ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్‌గానే ప్రకటించారు. ఆ తర్వాత ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సర్‌ప్రైజ్‌ని రివీల్ చేస్తూ.. మెర్చండైజ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా.. ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటి?’ అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే, చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ యూనిట్ పొందుపరిచిన లింక్‌ని క్లిక్ చేసి, ఆపై ఓపెన్ అయిన విండోలో ‘పసుపు రంగులో’ ఉంటే కంటిన్యూ బటన్‌ని నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మన పేరుతో పాటు ఈమెయిల్‌ని పొందుపరచాలి. అప్పుడు మనకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అంతే.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ప్రాజెక్ట్ కే టీజర్ట్‌ని మీరు సొంతం చేసుకోవచ్చు.
Naga Shaurya: ‘సారీ’ చెప్పిన నాగశౌర్య.. ఎందుకంటే?
The First Drop is here!
Grab Free Limited Merch of #ProjectK now.
#WhatisProjectK #Prabhas @SrBachchan pic.twitter.com/YJTd7nsaue
— Prabhas FC (@PrabhasRaju) July 8, 2023
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!