పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్‌లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్ చంద్ర… వారి రాబోయే చిత్రం “భీమ్లా నాయక్” కోసం అభినందించడానికి నా రొటీన్ నుండి విరామం తీసుకున్నాను. పద్మశ్రీ మొగులయ్య గారు, శివమణి వంటి అద్భుతమైన సంగీత విద్వాంసులను కలవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
Read Also : Poonam Kaur : ఆర్జీవీని టార్గెట్ చేసిన బ్యూటీ… మరో డైరెక్టర్ నీ వదల్లేదుగా !!
“భీమ్లా నాయక్”కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, రావు రమేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
