Site icon NTV Telugu

Kriti Sanon : బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు

Kriti Sanon

Kriti Sanon

Kriti Sanon : ప్రభాస్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతోంది. ఈ నడుమ ఈ బ్యూటీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అందరి అటెన్షన్ తన మీద పడేలా చేసుకుంది. ఆమె ఎవరో కాదండోయ్ కృతిసనన్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ లో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ మీద తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందంటూ రూమర్లు వచ్చాయి. అవన్నీ ఫేక్ అంటూ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. కానీ కొన్ని రోజులుగా ఆమె కబీర్ బహియాతో లవ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తరచూ ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. సీక్రెట్ గా వీరు తిరుగుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Senthil Kumar : రాజమౌళి-మహేశ్ మూవీ చేయకపోవడానికి కారణం అదే..

తాజాగా వీరిద్దరు ఇంగ్లండ్ కు వెళ్లారు. లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ కు అటెండ్ అయ్యారు. ఇద్దరూ జంటగా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా వీరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేస్తున్నారు. చాలా రోజులుగా బయట తిరుగుతూ దొరికిపోతూనే ఉన్నారు. కానీ రూమర్లపై స్పందించట్లేదు. సాధారణంగా కృతి సనన్ తనపై వచ్చే రూమర్లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు స్పందించకుండా ఇలా హింట్ ఇచ్చేస్తోందన్నమాట. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంటున్న కృతి.. టైమ్ దొరికినప్పుడల్లా కబీర్ తో ఇలా సందడి చేస్తోంది.

Exit mobile version