బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్‌డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్‌టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్‌టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్ అన్నీ కలిసిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రెండో భాగంలో, కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ, షాహిద్ కపూర్, రష్మిక తో ఉన్న సీన్స్, కథాంశం మరో కొత్త ఎమోషనల్ టచ్ ఇస్తుందని భావిస్తున్నారు.ఈ విషయాన్ని కృతి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది.
Also Read : Keerthi Suresh : మరో మాస్ రోల్‌తో వస్తోన్న కీర్తి సురేష్..
తన పోస్ట్‌లో “ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇక్కడికి చేరుకున్నాన” అని పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా ఆమె కెరీర్‌లో ఈ కొత్త అడుగు ఎంత ప్రాముఖ్యమైనదో, ఫ్యాన్స్‌కు ఎంత అద్భుతమైన అనుభూతిని అందించబోతోందో స్పష్టమవుతోంది. ఇక ప్రేక్షకులు ఈ సీక్వెల్ బాక్స్ ఆఫీస్‌లో పెద్ద హిట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృతి సనన్, షాహిద్ కపూర్, రష్మిక ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని మరింత హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘కాక్‌టెయిల్ 2’తో కృతి సనన్ తన స్టార్ పవర్‌ను మరల రీప్రూవ్ చేయనుందనే అంచనాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
