Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం, గౌరవం విషయంలో ఇంకా భారీ తేడా కొనసాగుతోందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి, టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి, సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోలకే వెళ్తుందని, ఖర్చులు తగ్గించాల్సి వస్తే ముందుగా హీరోయిన్ల పారితోషికాలపైనే కోతలు వేస్తారని అన్నారు. షూటింగ్ సమయంలో కూడా చిన్న చిన్న విషయాల్లో వివక్ష కనిపిస్తుందని, హీరోలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో తన స్థాయి హీరోకు లగ్జరీ కార్ పంపించి, తనకు మాత్రం సాధారణ వాహనం ఇచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ కిడ్స్ హవా ఇంకా బలంగా ఉందని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కృతి పేర్కొన్నారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో ఎన్నో అవకాశాలు స్టార్ కిడ్స్‌కు వెళ్లిపోయాయని, తాను కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!