ఉప్పెన చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు వరుస సినిమాలను చేజిక్కించుకొని విజయాలను మూట కట్టుకొంటుంది. ఇక ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కోలీవుడ్ లో బంఫర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- సెన్సేషనల్ డైరెక్టర్ బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా షూటింగ్ కన్యాకుమారిలో మొదలయ్యింది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఉప్పెన చిత్రంలో అమ్మడి యాక్టింగ్ చూసిన బాలా ఫిదా అయ్యి ఆమెను సూర్య సరసన హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా కృతి నక్క తోక తొక్కిందనే చెప్పాలి. వరుస అవకాశాలను అందుకుంటూ, స్టార్ హీరోల సరసన నటిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుంది. సూర్య లాంటి స్టార్ హీరోతోనే అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అంటే ముందు ముందు ఈ భామ రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
