Site icon NTV Telugu

Flash Back : మహేశ్ తో ఆ సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ హీరో కాలేవని కృష్ణ చెప్పారట

Super Stars

Super Stars

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్.

Also Read : Janhvi Kapoor : 7ఏళ్లుగా హిట్ చూడని జాన్వీ కపూర్ కు లిట్మస్ టెస్ట్

అయితే మహేశ్ బాబు నటించిన ఓ సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అని చెప్పారట. అదే  తమిళ హీరో కమ్ దర్శకుడు యస్ జె సూర్య దర్శత్వంలో మహేశ్ నటించిన చిత్రం ‘నాని’. ఈ సినిమాలో 20 ఏళ్ళు పైబడిన ఓ కుర్రాడు 8 ఏళ్ల చిన్నపిల్లలా అటు భర్తగా ఇటు చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు మహేశ్. కృష్ణ కుమార్తె మంజుల నిర్మాతగా వచ్చిన నాని సినిమా చూసిన కృష్ణ, మహేశ్ బాబుతొ ఈ సినిమా హిట్ అయితె నువ్వు స్టార్ హీరో కాలేవు. ఈ సినిమా ఫ్లాప్ అయితె నువ్వు స్టార్ హీరో అవుతావు అన్నారట. మ్యూజికల్ గా సూపర్ హిట్ అయినా రిలీజ్ రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది నాని. అలాగే కృష్ణ చెప్పినట్టు మహేశ్ బాబు సూపర్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా కథ నేను వినలేదు. ఒకవేళ నేను విని ఉంటె అసలు మహేశ్ ను ఆ సినిమా చేయనిచ్చే వాడిని కాదని మహేశ్ లాంటి హీరో అలాంటి సినిమా చేయకూడదు అని ఓ సందర్భంలో చెప్పారు.

Exit mobile version