Krishna Gadu Ante Oka Range: సినిమా రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయం అనిపిస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Gadu Ante Oka Range Movie Producer Crucial Comments: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి తెరకెక్కించారు. ఇక ఈ క్రమంలో నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకి సంబందించిన పలు ఆ విశేషాలను పంచుకున్నారు. తాను ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ అయినా కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టమని, ఆరేళ్ల క్రితం సినిమాల మీద ఓ ఆలోచన పుట్టిందని అన్నారు.. ఎప్పుడూ మనం సినిమాలను చూడటమేనా? మనం ఎందుకు తీయలేమని నాలో ఆలోచన పుట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నారు. తన స్నేహితుడు ఒకరు కథలు రాస్తుండేవాడని, ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేసిన ఆయన వల్ల సినిమాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పరిచయం చేశాడని ఆయనే మా సినిమా డైరెక్టర్ రాజేష్ దొండపాటి అని చెప్పుకొచ్చారు.
Baby: బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
నిర్మాతగా ఓ కుటుంబంతో కలిసి అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఓ సినిమా తీయాలనుకున్నానని, నాకున్న ఆలోచనలే మా దర్శకుడుకి ఉండడంతో మా ఇద్దరి ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. తెలుగులో సినిమా తీయడం కష్టమని అంటుంటారు కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని అని తాను మొత్తం యూఎస్‌లోనే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానేజ్ చేసే వాళ్లని, అనుభవం లేకపోవడంతో కాస్త బడ్జెట్ అదుపు తప్పిందని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో దిల్ రాజు, అరవింద్, రామానాయుడు అంత ఎదగాలని అనుకుంటున్నానని పేర్కొన్న ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి క్రియేటివ్ వ్యక్తుల వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వారే తనకు స్ఫూర్తి అని అన్నారు. తమ సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ సాయం చేస్తున్నారని, మూవీని రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయంగా అనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?