Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలాంటి పాత్ర అయినా ఆయన దిగంత వరకే.. ఒక్కసారి ఆయన నటించడం మొదలుపెట్టాడా..? అవార్డులు.. రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఈ మధ్య వయస్సు పైబడడంతో సినిమాల్లో తక్కువ కనిపిస్తున్న కోటా.. సమయం చిక్కినప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీ గురించిన ఘాటు నిజాలను బయటపెడుతుంటారు. ఇక తాజాగా మరోసారి కోటా.. స్టార్ హీరోల గురించి, ఇప్పుడున్న ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు.
Ahimsa: ఏందీ బ్రో.. బయట టాక్ చూస్తే అలా.. వీళ్లు చూస్తే ఇలా
“ఇప్పుడు సినిమా అనేది లేదు అంతా సర్కస్. ఇక్కడ అంతా ఒక సర్కస్ నడుస్తోంది. ఒకప్పుడు ఉన్న ఇండస్ట్రీ కాదు. ఇంకొక రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకొక రామారావు లేడు. అసలు హీరోలు ఇప్పుడు ఎలా ఉంటున్నారు. మేము రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాం.. ఆరు కోట్లు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా.. ఇప్పుడు హీరోలు పేతా సాంగ్స్ కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు. అప్పట్లో రామారావు గారు 60 ఏళ్ల వయస్సులో శ్రీదేవితో డాన్స్ చేస్తే వాళ్లిద్దరు మాత్రమే కనపడ్డారు కానీ.. ముసలోడు డాన్స్ వేసాడు అని అనలేదు. ఇక ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న ఆర్టిస్టులు బతకడానికి కష్టమైపోయింది. చిన్న సినిమాలు బతకాలి అంటే ఒక కమిటీ వేసి తెలుగు ఆర్టిస్టులతో సినిమా చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది ఆర్టిస్ట్ లు బాగుంటారు. చిన్న ఆర్టిస్టులను బ్రతికించండి. ఎదో ఒక అడ్వర్టైజ్ మెంట్ చేద్దాము అనుకుంటే బాత్ రూమ్ క్లిన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం వరకు హీరోలే చేస్తున్నారు. దయచేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.