Photo Talk: కోటాకు ప్రేమతో వడ్డిస్తున్న ఆలీ.. ఏవైనా ఆ రోజులే బావుండేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Photo Talk: కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సమయం తగ్గుతుంది కానీ, దూరం పెరుగుతుంది. కాలం మారేకొద్దీ బండలు.. అనుబంధాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక చిత్ర పరిశ్రమ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలిసి ఉండదు. అప్పట్లో క్యార్ వ్యాన్ లు ఉండేవి కావు. షూటింగ్ ప్రదేశంలో ఎక్కడ చెట్టు కనిపిస్తే.. దానికింద నటీనటులందరూ కుర్చీలు వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకొనేవారు. షాట్ కు రమ్మనగానే వెళ్ళిపోయేవారు. మళ్లీ తిరిగివచ్చి ముచ్చట్లు పెట్టుకునేవారు. ఇప్పటిలా అందరికి ప్రొడక్షన్ ఫుడ్ ఉండేది కాదు. ఎవరికి వారు బాక్స్ లు తెచ్చుకొని.. అందరు కలిసి భోజనం చేసేవారు. అదుగో అలా భోజనం చేసేటప్పుడే ఈ ఫోటో క్లిక్ చేసినట్లు కనిపిస్తుంది. కమెడియన్స్ కోటా శ్రీనివాసరావు, ఆలీ, ఏవీఎస్, గుండు హనుమంతురావు తదితరులు షూటింగ్ స్పాట్ లో కూర్చోని భోజనం చేస్తున్నారు. ఈ షూటింగ్ ఏ సినిమాకు సంబంధించిందో తెలియదు కానీ.. ఈ ఒక్క ఫోటో అప్పటి షూటింగ్ రోజులను.. అప్పటి అనుబంధాలను గుర్తుచేస్తోంది. కోటాకు ప్రేమగా ఆలీ వడ్డిస్తున్నాడు.
Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్‌కమ్ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..
ఇక ఏవీఎస్, గుండు హనుంతురావు చక్కగా భోజనం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు వారు లేని లోటు చాలా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలకృష్ణ నటించిన టాప్ హీరో సమయంలో ఫోటో అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు క్యార్ వ్యాన్ లు వచ్చేసాయి. షూటింగ్ అవ్వగానే ఎవరి బండిలోకి వారు వెళ్లిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇలా చేయాలన్న ఇప్పుడు ఉన్న హీరోలు చేయలేరు. ఏదిఏమైనా ఆరోజులే బావుండేవి.. కాలాలు మారుతున్నప్పుడు మనుషులు మారడం అవసరమే.. కానీ, ఇలాంటి రేర్ ఫొటోలు చూసినప్పుడే వాటి విలువ తెలుస్తోంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Also Read
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!