Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్‌కమ్ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రజనీ చేస్తున్న సినిమాలలో జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 ఒకటి.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. జైలర్ సినిమాకు అద్భుతంగా మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు..ఈ సినిమాలో దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఓ స్టిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ దుషారా విజయన్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది తెలియాల్సి వుంది..
తాజా సమాచారం ప్రకారం తలైవా 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్స్ గ్రాండ్ గా విడుదల కానుంది.జైభీమ్ వంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ మరి ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ అలాగే కోలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ ముఖ్య పాత్రలలో నటించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి… అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు రజినీకాంత్ మరోవైపు తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్ దళపతి తో తెరకెక్కిస్తున్న లియో సినిమాతో బిజీ గా వున్నాడు. ఆ సినిమా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!