Site icon NTV Telugu

Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!

Koratala Siva

మావెరిక్ దర్శకుడు కొరటాల శివ ఖాతాలో పలు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీ కానున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా లైన్ లో పెట్టినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ కావడం విశేషం.

Read Also : Ajay Devgan: హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు..?

కొరటాల మాట్లాడుతూ “మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాను. మేము ఇప్పటికే రెండు సినిమాలు చేశాము. ఆ రెండు సినిమాలూ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్. కాబట్టి నెక్స్ట్ మా కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు రావడం సహజం. అయితే మేమిద్దరం కలిసి ఖచ్చితంగా ఒక సినిమా చేస్తున్నాము. అది హ్యాట్రిక్ అవుతుంది” అని మహేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు కొరటాల శివ. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం కాదని అన్నారు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు చేయబోతున్నాను అని, అయితే వారి డేట్స్ ఎప్పుడు కుదురుతాయనేది తెలియదని అన్నారు. అంటే ముగ్గురు స్టార్ హీరోలలో ఎవరి డేట్స్ ముందుగా దొరికితే వారితో కొరటాల మూవీ ఉంటుందన్న మాట. ఇక ఏప్రిల్ 29న కొరటాల దర్శకత్వలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version