Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!

Konidela Pavan Tej Janta

Konidela Pavan Tej Janta

 టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం బ్యాక్ గ్రౌండ్ తోనే కాకుండా, వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు యువ హీరో కొణిదెల పవన్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంట’. వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తాజాగా అమలాపురంలో జరిగింది. అయితే, ఈ కార్యక్రమం అంతటిలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన, టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఒకటుంది. అదే ఈ సినిమా క్యాప్షన్! “యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..” అంటూ పెట్టిన ఈ క్యాప్షన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అసలు ఆ రాజ్యం ఏంటి? రాముడితో కాకుండా రాజ్యంతో హీరో చేసే ఆ యుద్ధం వెనుక ఉన్న బలమైన ఎమోషన్ ఏంటి? అన్నది నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది.
హీరో పవన్ తేజ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ క్యాప్షన్ చూసి ఇండస్ట్రీ నుంచి తనకు చాలా ఫోన్లు వస్తున్నాయని, ఇది పక్కా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ యాక్షన్ డ్రైవ్ అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పడం సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ‘జంట’ టీమ్ మాత్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ప్రాంతంలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో, తమ సినిమా షూటింగ్ మొత్తం అమలాపురం బ్యాక్ డ్రాప్ లోనే రెండు నెలల పాటు నాన్-స్టాప్ గా చేయబోతున్నారు. పచ్చని పల్లెటూరి వాతావరణంలోకి ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో.. ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ డిజైన్ చేసిన కొత్త తరహా యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కానున్నాయి. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రెండేళ్ల పాటు శ్రమించి ఈ కథను ఒక రేంజ్ లో మలిచారని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను వేరే ఆఫర్లు కూడా పక్కనపెట్టానని హీరో పవన్ తేజ్ వివరించాడు.