Site icon NTV Telugu

బ్రేకింగ్: హీరో విక్రమ్ కి కరోనా..

vikram

vikram

ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంతోషపడేలోపు ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతోంది. ఇక ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.  అయితే.. ఇది ఒమిక్రాన్ వేరియంట్ అవునా ..? కాదా..? అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టుల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విక్రమ్ వైద్యుల పర్యవేక్షణలో తన నివాసంలోనే చికిత్స తీసుకొంటున్నారు. ఇటీవల కాలంలో తనతో పాటు తిరిగిన వారందరిని కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇకపోతే ఈ విషయం తెలిసిన దగ్గరనుంచి విక్రమ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Exit mobile version