Vijay: కేసీఆర్ తో తమిళ్ హీరో భేటీ.. ఏంటీ సంగతీ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. బుధవారం సాయంత్రం విజయ్ మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. విజయ్ కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్ స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శాలువా కప్పి, బహుమతిని అందించారు కేసీఆర్. ఇక ఈ భేటీలో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మంత్రి సంతోష్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇకపోతే విజయ్, కేసీఆర్ మీటింగ్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా..? అని టాక్ నడుస్తోంది. మరోపక్క మినిస్టర్ రోజా భర్త సెల్వమణి తమిళ్ హీరోలను బయటికి వెళ్లి షూటింగ్స్ జరపకూడదని, దానివలన తమిళ్ ఇండస్ట్రీలో పనిచేసేవారు ఇబ్బందిపడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మాటను లెక్కచేయకుండా విజయ్ తన నెక్స్ట్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చాడు.
ఇక ఈ విషయం గురించి కూడా సీఎం తో చర్చించే ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే ఇందులో నిజాలు ఏంటి అనేవి తెలియదు కానీ.. ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే కొన్నిరోజుల నుంచి ఉంటున్నాడు. గతంలో మంత్రి మినిస్టర్ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో విజయ్ పాల్గొన్న విషయం విదితమే. ఈ పరిచయం వలన హైదరాబాద్ లో ఉంటున్న విజయ్ ను సంతోష్ కుమార్, కేసీఆర్ ను కలిసేవిధంగా ఏర్పాటు చేసారని, అంతేతప్ప ఇందులో ఏ రాజకీయం లేదని విజయ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి ఈ విషయమై విజయ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
தெலங்கானா முதல்வர் சந்திரசேகர் ராவை சந்தித்தார் நடிகர் விஜய்.
Said to be casual meeting.@actorvijay | #ThalapathyVijay | #Vijay | #Thalapathy67 pic.twitter.com/FcBRObtsbJ
— Aathiraa Anand (@AnandAathiraa) May 18, 2022
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!