Kollywood entry ‘Color Photo’ Heroine !
ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ ఎంపికైన విషయం తెలిసిందే. అందులో సుహాస్ సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. అలానే ఇటీవలి కాలంలో వెబ్ సీరిస్ లోనూ నటిస్తూ నటిగా తన సత్తాను చాటుతోంది. తాజాగా ఈ తెలుగు భామ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘ఓ మై కడవులే, మన్మథ లీలై’ చిత్రాల కథానాయకుడు అశోక్ సెల్వన్ సరసన చాందినీ చౌదరికి ఛాన్స్ దక్కింది. విశేషం ఏమంటే… ఈ కోలీవుడ్ యంగ్ హీరో ఆ మధ్య తెలుగులో ‘నువ్విలా నువ్విలా’ మూవీలో నటించాడు. అలానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు.
ఇంకా పేరు నిర్ణయించని ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీలో చాందినీ చౌదరితో పాటు మేఘా ఆకాశ్, కార్తిక మురళీధరన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్ శిష్యుడు సి. ఎస్. కార్తికేయన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కమల్ హాసన్ ‘విశ్వరూపం -1, విశ్వరూపం- 2’ చిత్రాలకు కార్తికేయన్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి కార్తికేయన్ చెబుతూ, ”ఇది స్కూల్, కాలేజీ, పోస్ట్ కాలేజ్ కు సంబంధించిన కథ. ఓ యువకుడి జీవితంలోకి ఈ మూడు ఫేజెస్ లో ఈ ముగ్గురు హీరోయిన్లు వస్తారు” అని తెలిపాడు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చాందినీ చౌదరి చెబుతోంది.