Site icon NTV Telugu

Drugs Case : డ్రగ్స్ కేసులో తెలుగు నటులతో సంబంధమున్న తమిళ నటుడు అరెస్ట్

Drugs Case

Drugs Case

Drugs Case : తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా కలకలం రేగింది. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పుడు మరో నటుడు కృష్ణ కూడా అరెస్టు అయ్యాడు. కృష్ణ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంగంబాకం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లూ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా అనే విషయం మీద ఆరా తీయడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Read Also : Etv Win Vs Zee 5 : జీ5పై ఈటీవీ విన్ కాపీ ఆరోపణలు..!

అయితే మరో షాకింగ్ విషయం ఏమిటి అంటే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలు‌ ఉన్నాయని పోలీసులు గుర్తించారు. కృష్ణ అరెస్టుతో తమిళ పరిశ్రమ మొత్తం వణికి పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కృష్ణ విచారణలో పోలీసులు పలువురు నటుల పేర్లను తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే చెన్నైలో అరెస్టు అయిన కృష్ణకు తెలుగులో ఏ నటీనటులతో సంబంధాలు ఉన్నాయనే విషయం మీద ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది. నటుడు శ్రీరామ్ ని అరెస్ట్ చేసిన తర్వాత తాను డ్రగ్స్ ఎవరికీ అమ్మలేదని, తాను డ్రగ్స్ వినియోగించానని ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా విచారణకు సహకరిస్తానని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

Read Also : Salman khan : స్టార్ హీరోయిన్ బాత్రూమ్ లో సల్మాన్ ఖాన్ పోస్టర్..

Exit mobile version