యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూస్ చేశాడు. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిజానికి ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘సార్’ అదే రోజున రిలీజ్ అవుతున్న కారణంగా ఒక రోజు డిలేతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా ని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఒక మంచి సినిమా, కొత్తగా రాసిన కథతో తెరకెక్కిన సినిమా అంటూ మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా, అన్ని సెంటర్స్ లో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూనే ఉంది.
కిరణ్ అబ్బవరంకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్ చాలా అవసరమైన సమయంలో వచ్చింది. చాలా రోజులుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడీ సీమ కుర్రాడు. 2022లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లాస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ కాపాడుకోవాలి అంటే ‘వినరో భాగ్యమి విష్ణు కథ’ సినిమా డూ ఆర్ డై లాంటిది. ఇలాంటి సిచ్యువేషణ్ లో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడు. ఇకపై కూడా ఇలానే కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తే మనోడి నుంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.