Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !

Kiran Abbavaram

Kiran Abbavaram

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంకు కోలీవుడ్ సినిమాలు పెద్ద మైనస్‌గా మారుతున్నాయా? ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో ఏదో ఒక పెద్ద తమిళ సినిమా పోటీకి వచ్చి హిట్ కొట్టేయడం కిరణ్ కెరీర్‌కు బ్రేకులు వేస్తోందా? అనేలా ఆయన సినిమాలకి తమిళ సినిమాలు అడ్డుపడుతున్నాయి. ఇక తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇదే విషయం మీద కిరణ్ అభవరం క్లారిటీ ఇచ్చాడు. పలుమార్లు బాక్సాఫీస్ క్లాష్ వల్ల తన సినిమాలు ఇబ్బంది పడిన మాట నిజమేనని, అందుకే ఈసారి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి సోలో రిలీజ్ ప్లాన్ చేయాలని సాయి రాజేష్ ని కోరుతున్నారంటూ మైక్‌లోనే ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా విజయ్ చివరి సినిమా జననాయగన్ ఈసారి జూలై 24వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో ఆ సినిమా వస్తే కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ వాయిదా పడుతుందా అని ప్రశ్నించగా “వేరే సినిమాలు పోటీకి వచ్చినా మా కంటెంట్‌పై మాకు గట్టి నమ్మకం ఉంది. డేట్ మార్చే ప్రసక్తే లేదు, అదే రోజు వస్తున్నాం” అని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రొడక్షన్ సైడ్ నుండి సాలిడ్ పర్సనాలిటీస్ అయిన ఎస్కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లాంటి వాళ్ళు ఉండగా తమకు ఓపెనింగ్స్ లేదా థియేటర్ల టెన్షన్ అసలే లేదని కిరణ్ అబ్బవరం తేల్చి చెప్పారు. మరి ఈ తమిళ సినిమాల గండం గట్టెక్కి కిరణ్ ఈసారి సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి!