Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు అన్ని పక్కన పెట్టి నెల క్రితమే కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఊహించని విధంగా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు. దాదాపు లక్షల్లో లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాడు ఆర్పీ. నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలను తెచ్చి.. మంచిగా వండుతుండడంతో జనాలు కర్రీ పాయింట్ కు క్యూ కట్టారు. ఇక ఆ తరువాత మొదలయింది అసలు సమస్య. ఇప్పుడు కుమారి ఆంటీ ఎలాగో అప్పుడు ఆర్పీ కూడా అలాగే తన షాప్ ను మూసివేయాల్సి వచ్చింది. అయితే ఆర్పీ మాత్రం చిన్న షాప్ ను పెద్దది గా చేసి షాక్ ఇచ్చాడు. ఇలా హైదరాబాద్ లో మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేశాడు. ఇప్పుడు వేరే ఊర్లలో కూడా బ్రాంచ్ లను ఓపెన్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే .. చేపల పులుసు టేస్ట్ ఏమో కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఇక తాజాగా ఈ విమర్శలపై కిర్రాక్ ఆర్పీ స్పందించాడు. ” మీరు కిలో చికెన్ కొంటే కిలో చేతికి వస్తుంది. మటన్ కెలో కొంటే కిలో చేతికి వస్తుంది. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో చేతికి రాదు. తలకాయ, తోక పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనె వాడాలి. రుచి కోసం మామిడి కాయలను యాడ్ చేయాలి. అవి కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. ఇవొక్కటే కాదు.. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర.. ఇలా చేపల కర్రీకి ఉపయోగించే పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నా కర్రీపాయింట్‌లో ధరలు ఉన్నాయి. ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి ఊరికే కూడా ఇస్తాను. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది. నేను లాస్ అవ్వలేను.. నేను చేస్తుంది కూడా సేవతో సమానమే. చికెన్,మటన్ దొరికినట్లు చేప అన్ని ప్రదేశాల్లోనూ దొరకదు. అవన్నీ ఎక్కడెక్కడ నుంచో తెప్పించి.. కూరలు చేసి అమ్ముతున్నాం.. ఇదొక రిస్కీ బిజినెస్.. అందుకే ఆ రేట్లు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.