Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?

Kingdam

Kingdam

Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో బలమైన ఎమోషన్ కూడా ఉంటేనే అది ప్రేక్షకుల మనసులను తాకుతుంది. విజయ్ ఎంత బాగా నటించినా.. టెక్నికల్ గా ఎంత బాగున్నా పాత్రల మధ్య ఎమోషన్ లేకపోతే అవి కనెక్ట్ కావు. కింగ్ డమ్ విషయంలో అదే జరిగింది.

Read Also : Kingdom : కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో.. ఎవరతను..?

చివరగా ఈ సినిమాకు పార్ట్-2 కూడా వస్తున్నట్టు హింట్ ఇచ్చారు. ఇది చూశాక ప్రేక్షకులు అవసరమా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమానే మరింత బలంగా రాసుకుంటే అయిపోయేదని.. మొదటి పార్టు పెద్ద హిట్ కాకుండా సెకండ్ పార్ట్ కోసం సీన్లు రాసుకోవడం ఎందుకు అంటున్నారు. ఈ మొదటి పార్ట్ లో రెండో పార్టుకు బలమైన రీజన్ కూడా లేదు. కేవలం ఇరికించినట్టు ఓ సీక్వెల్ సీన్ రాసుకున్నారు. కొన్ని కథలు ఒకసారి మాత్రమే బాగుంటాయి. రెండో పార్ట్ తీస్తే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. గతంలో ఎవర్ గ్రీన్ సినిమాకు రెండో పార్ట్ తీసినా పెద్దగా పనిచేయలేవు. కింగ్ డమ్ విషయంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి రెండో పార్ట్ అవసరమా అని అడుగుతున్నారు అభిమానులు. విజయ్ లాంటి గొప్ప నటుడు మంచి కథలను ఎంచుకుని మూవీ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

Read Also : Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్

Exit mobile version