Khushi Trailer: భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khushi Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి లవ్ స్టోరీస్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం ఒకటి అయితే.. విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తరువాత రిలీజ్ అవుతున్న చిత్రం కావడం మరొక విశేషం. ఇక సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరి ముగ్గురు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్, సామ్ ల మధ్య లవ్ స్టోరీని చాలా అద్భుతంగా చూపించాడు శివ నిర్వాణ. ముఖ్యంగా విజయ్- సమంత రొమాన్స్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఒక క్రిస్టియన్ అబ్బాయికి బ్రాహ్మణల అమ్మాయికి మధ్య జరిగిన లవ్ స్టోరీగా ఖుషీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబో మహానటిలో కనిపించేసరికి వీరిని ఎవరు కొత్త జంటలా చూడకపోవడం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమాతో విజయ్- సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!