NTV Telugu Site icon

Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు..! క్లారిటీ ఇచ్చిన ఖుషీ టీం..

Kushi Movie

Kushi Movie

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ హీరోగా, స‌మంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం చిత్రం ‘ఖుషి’.. శివ నిర్వాణ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ మూవీ షూట్‌లో చోటు చేసుకున్న ఘటనతో విజయ్‌ దేవరకొండతో పాటు సమంతకు కూడా గాయాలైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కాశ్మీర్‌లోని ప‌హల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇద్దరు లిడ్డర్ న‌దికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడిపే సీన్‌ సమయంలో.. వాహ‌నం నీటిలో పడటంతో ఇద్దరూ గాయపపడం.. వెంటనే చిత్ర యూనిట్‌ చికిత్స అందించిందని ఆ వార్తల సారాంశం.. అయితే, దీనిపై స్పందించిన ఖుషీ టీం.. క్లారిటీ ఇచ్చింది.

Read Also: Ration Rice: తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ

ఖుషీ సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన ఆ చిత్ర యూనిట్‌.. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.. కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని అంతా హైదరాబాద్ చేరుకున్నారని ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది ఖుషీ టీం.. కాగా, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబ‌ర్ 23వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు త‌మిళ్, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Show comments