Ponniyin Selvan: సినిమాకు కాషాయరంగు పులుముతున్నారు అన్న డైరెక్టర్.. ఏకిపారేసిన ఖుష్బూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponniyin Selvan:కోలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలకు రాజకీయ రంగును అద్దుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై కొందరు బీజేపీ చూపు పడిందని చెప్పుకొస్తున్నారు. భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాకా పలువురు పలురకాలుగా అంటూ వస్తున్నారు. కొంతమంది మణిరత్నం సరిగ్గా తీయలేదు అంటే మరికొందరు తెలుగు బాహుబలితో పోలుస్తూ సినిమా బాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ కాకుండా ఈ సినిమా వివాదాల చుట్టూనే తిరుగుతోంది. అభిమానులే కాకుండా దర్శకులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ .. ఇటీవల ఈ సినిమాలో మణిరత్నం రాజరాజ చోళన్ ను హిందువుగా చూపించారు, రాజరాజ చోళుడుకి, తిరువళ్ళువర్‌కి కాషాయ రంగు జెండా కప్పారు.. సినీ పరిశ్రమ కాషాయరంగును పులుముకుంటుంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక వెట్రిమారన్ మాటలకు మరికొంతమంది దర్శకులు కూడా వత్తాసు పలికారు. ఇక ఈ దర్శకులకు సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తాజాగా ఆమె ఒక మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ “అంత పెద్ద చరిత్రను రెండు గంటలలో ప్రేక్షకులకు చూపించడం కేవలం మణిరత్నం వలనే అవుతోంది. ఆయనలా ఎవరు సినిమా తీయలేరు. ఇక ఈ మధ్యకాలంలో హిందూ మతాన్ని, దేవుళ్లని వ్యతిరేకించడం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిపోయింది. సినిమాలో హిందువులను చూపించలేదు అనేవారికి ఒకటే చెప్తున్నా.. ఏదైనా చూసే కళ్ళను బట్టి ఉంటుంది. వారి మైండ్ సెట్ మార్చుకొని చూస్తే సినిమా.. సినిమాలానే కనిపిస్తోంది”అని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వెట్రిమారన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!