Site icon NTV Telugu

Ponniyin Selvan: సినిమాకు కాషాయరంగు పులుముతున్నారు అన్న డైరెక్టర్.. ఏకిపారేసిన ఖుష్బూ

Kushboo

Kushboo

Ponniyin Selvan:కోలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలకు రాజకీయ రంగును అద్దుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై కొందరు బీజేపీ చూపు పడిందని చెప్పుకొస్తున్నారు. భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాకా పలువురు పలురకాలుగా అంటూ వస్తున్నారు. కొంతమంది మణిరత్నం సరిగ్గా తీయలేదు అంటే మరికొందరు తెలుగు బాహుబలితో పోలుస్తూ సినిమా బాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ కాకుండా ఈ సినిమా వివాదాల చుట్టూనే తిరుగుతోంది. అభిమానులే కాకుండా దర్శకులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ .. ఇటీవల ఈ సినిమాలో మణిరత్నం రాజరాజ చోళన్ ను హిందువుగా చూపించారు, రాజరాజ చోళుడుకి, తిరువళ్ళువర్‌కి కాషాయ రంగు జెండా కప్పారు.. సినీ పరిశ్రమ కాషాయరంగును పులుముకుంటుంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక వెట్రిమారన్ మాటలకు మరికొంతమంది దర్శకులు కూడా వత్తాసు పలికారు. ఇక ఈ దర్శకులకు సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

తాజాగా ఆమె ఒక మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ “అంత పెద్ద చరిత్రను రెండు గంటలలో ప్రేక్షకులకు చూపించడం కేవలం మణిరత్నం వలనే అవుతోంది. ఆయనలా ఎవరు సినిమా తీయలేరు. ఇక ఈ మధ్యకాలంలో హిందూ మతాన్ని, దేవుళ్లని వ్యతిరేకించడం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిపోయింది. సినిమాలో హిందువులను చూపించలేదు అనేవారికి ఒకటే చెప్తున్నా.. ఏదైనా చూసే కళ్ళను బట్టి ఉంటుంది. వారి మైండ్ సెట్ మార్చుకొని చూస్తే సినిమా.. సినిమాలానే కనిపిస్తోంది”అని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వెట్రిమారన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version