Site icon NTV Telugu

KGF 2 : ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్… అప్పటిదాకా ఆగాల్సిందే !

KGF2

శాండల్‌వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచే ట్రైలర్ గురించి ఎదురు చూపులు మొదలయ్యాయి.

Read Also : Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు… కుదరదు అన్నందుకే అలా…

ఈరోజు ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ విడుదలకు సంబంధించిన డేట్ ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 27న సాయంత్రం 06:40 గంటలకు ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. యష్ అభిమానులను ఈ అప్డేట్ ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు. హోంబలే పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2″లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. విజయవంతమైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ బహుభాషా చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version