KGF Actor Death : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని దినేష్ కుటుంబం తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు కేజీఎఫ్ మూవీతో మంచి గుర్తింపు లభించింది.
Read Also : Sri Tej : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్ కు మిషన్ వాత్సల్య స్కీమ్
ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్ కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ గా ఎంతో ఫేమస్. దాదాపు 200లకు పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీర మదకరి, చంద్రముఖి ప్రాణసకి, రాక్షస వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దినేష్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగానే మరణించారు.
Read Also : Upasana : సమాజం ఆడవారిని ఎంకరేజ్ చేయదు : ఉపాసన
