Sreejith Ravi: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ దారుణాలు వెలుగు చూడడం బాధాకరం.ఇప్పటికే మలయాళ నటుడు విజయ్ బాబు ఒక యువ నటిపై లైంగిక వేధింపులకు గురైన కేసులో సతమతమవుతున్న విషయం విదితమే.. ఇక తాజాగా మరో మలయాళ నటుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. మలయాళ నటుడు శ్రీజిత్ రవిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఫిర్యాదులో తెలిపారు.
జూలై 3 న ఒక పార్క్ లో ఆడుకొంటున్న ఇద్దరు బాలికలను దగ్గరకు తీసుకొని తాకరాని చోట తాకుతూ ఇబ్బందికి గురిచేశాడని బాలికలు తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు శ్రీజిత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీజిత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం శ్రీజిత్ కు కొత్తేమి కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన మాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.
Also Read
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..