Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె లవ్ స్టోరీని బయట పెట్టేసింది. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకుంది. మీ భర్తతో ఎన్నేళ్లుగా లవ్ లో ఉన్నారు అని యాంకర్ సుమ ప్రశ్నించింది. దానికి ఏ మాత్రం తడబడకుండా అన్నీ బయట పెట్టేసింది.
Read Also : Andhra King Thaluka : రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ కొత్త షెడ్యూల్.. అక్కడే..
నేను నా భర్త ఆంటోనీ తట్టిల్ తో ఇంటర్ లోనే లవ్ లో పడ్డాను. అప్పుడు నా ఏజ్ 17 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే మేం చాలా డీప్ గా ప్రేమించుకున్నాం. దాదాపు 15 ఏళ్లుగా మేం లవ్ లో ఉన్నాం. మా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అతని సపోర్ట్ వల్లే నేను ఇన్నేళ్లు సినిమాల్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా నటించాను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన నన్ను సినిమాల్లో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఆమె ప్రస్తుతం నానితో మరో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Uppu Kappurambu : 28 రోజుల్లోనే షూట్ కంప్లీట్.. కీర్తి సురేష్, సుహాస్ కామెంట్స్
