టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది. ఇదంతా ఎందుకు అంటే.. కీర్తి సురేష్ మొదటిసారి మ్యూజిక్ వీడియోలో నటించింది.
ది రూట్, సోని మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా నిర్మించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ తాజాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టిస్తోంది. గాంధారీ గాంధారీ.. నీ మరిది గాంధారీ .. దొంగ చందమామలాగా వంగి చూసిండే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మాస్ లిరిక్స్ కి తగ్గట్టు కీర్తి సురేష్ మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. లవ్ స్టోరీ సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ ఈ సాంగ్ సంగీతం అందించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద.. దర్శకత్వం వహించింది. ఇక ఇందులో కీర్తి లుక్ అదిరిపోయింది. మార్వాడీ డ్రెస్ లో మహానటి అందాలు చెప్పడానికి వర్ణించలేము అన్నట్లుగా ఉన్నాయి. ఇక కీర్తి అంతకు ముందు ఏ సినిమాలోనూ అంతగా డాన్స్ చేసే పాత్రలు రాలేదు.. దీంతో మొదటిసారి కీర్తి ఊర మాస్ స్టెప్పులతో ఆలరించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరుకూడా ఈ గాంధారీపై ఓ లుక్ వేసేయండి..
