హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ చేసింది కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోని, కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్న ఈ హీరోయిన్ సర్కారు వారి పాట సినిమాతోనే యూటర్న్ తీసుకోని గ్లామర్ ట్రాక్ ఎక్కింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే గ్లామర్ షో చేస్తుంది కీర్తి. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతునే ఉన్న కీర్తి, లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో చేసిన స్కిన్ షో చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
తాజాగా కీర్తి హాట్ లుక్‌కు సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.లావెండర్ లవ్ అని కోట్ చేస్తూ కీర్తి సురేష్ చీరలో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లావెండర్ చీరని అలా జాలువార్చి, క్లివేజ్ షో చేస్తూ కీర్తి సురేష్ మత్తెక్కించేలా ఉంది. ఆ మధ్యలో జిమ్ ఎక్కువగా చేసి, బక్కచిక్కినట్లు ఉన్న కీర్తి సురేష్ ని చూసి, ఇలా అయిపోతుంది ఏంటి? క్యూట్ గా ఉండే ఒకప్పటి కీర్తి సురేష్ ఇక కనిపించదా అనుకున్నారు? క్యూట్ గా కాదు హాట్ గా కనిపిస్తాను అంటూ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్ తో యూత్ హార్ట్స్ కి గెలిచేసింది. సారీ కట్టుకోని కూడా అందంగా కనిపిస్తూనే, గ్లామర్ ట్రీట్ ఇస్తూ బోల్డ్ ఫోటోస్ తో కీర్తి సురేష్ వావ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సైరెన్, రివాల్వర్ రీటా అనే సినిమాలు చేస్తోంది.
Lavender love 💜 pic.twitter.com/hgkSICqxr8
— Keerthy Suresh (@KeerthyOfficial) September 3, 2023