Keerthy Suresh: మహానటి బాలీవుడ్ ఎంట్రీ.. సమంత హీరోతో రొమాన్స్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: ఇంట గెలిచి రచ్చ గెలవడం స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లందరూ ఇంట గెలిచి రచ్చ గెలిచినవారు కొంతమంది.. అయితే రచ్చ గెలిచి ఇంట గెలిచినవారు మరికొందరు. ఇక ఇప్పుడు ఇంట గెలిచిన ఒక హీరోయిన్ రచ్చ గెలవడానికి బయలుదేరింది. ఆమె మహానటి కీర్తి సురేష్. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అట్లీ తన తర్వాత సినిమా కూడా బాలీవుడ్ హీరోతోనే ఉండనుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో అట్లీ ఒక సినిమ చేయనున్నాడట.
Prabhas: మరీ.. అంత మొహమాటం పనికిరాదు డార్లింగ్.. ?
Also Read
ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం అమ్మడు చాలా కష్టపడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆమె అట్లీతో కలిసి ఎన్నోసార్లు కనిపించింది. దీంతో ఈ వార్తల్లో నిజముందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక జవాన్ తర్వాత నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్న అట్లీ త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నాడట. ఇప్పటికే వరుణ్ ధావన్ సిటాడెల్ సినిమాలో సమంతతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ, కీర్తి సురేష్ కి ఆఫర్ ఇవ్వడం అంటే ఆమె రొట్టె విరిగి నెయ్యిలో పడినట్టే అని అభిమానులు చెప్పకువస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మోత మోగిపోనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో మహానటి బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!