Site icon NTV Telugu

Shiva Karthikeyan: స్టార్ హీరోకే రివర్స్ లో కేసు వేసి షాక్ ఇచ్చిన నిర్మాత

Shivakarthikeyan

Shiva karthikeyan

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ లోకల్ సినిమాకు గాను రూ. 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్‌ ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై గురువారం మద్రాస్ కోర్టు విచారణ చేపట్టగా.. హీరో శివ కార్తికేయన్ కి ఈవర్స్ లో షాకిచ్చాడు జ్ఞానవేల్ రాజా. శివ కార్తికేయన్ వలన తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

తనకు మిస్టర్ లోకల్ కథ నచ్చలేదని చెప్పినా వినకుండా శివ కార్తికేయన్ బలవంతంగా ఈ సినిమా చేయమని ఒప్పించాడని. దీనివలనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు పిటిషన్ లో తెలిపాడు. అంతేకాకుండా సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా.. ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్ అపరాధం విధించాలని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలిపారు. మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

Exit mobile version