Kayadu Lohar: కయాదు లోహార్ క్రేజీ లైనప్.. అమ్మడి దశ తిరిగినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aమోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన కయాదు లోహార్ మొదట చిన్న పాత్రలతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. నాచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో దర్శకుల దృష్టిని ఆకర్షిస్తూ, ఇప్పుడు లీడ్ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది. గత సంవత్సరం “డ్రాగన్”తో పర్వాలేదనిపించుకున్న కయాదు, ఈ ఏడాది విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన “ఫంకీ”లో ‘చిత్ర’ పాత్రలో కనిపించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అయితే, ఆమె లైనప్ మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమాలో కయాదు లోహార్ కీలక పాత్రలో నటిస్తోంది. నాని కెరీర్‌లో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఆమె పాత్ర కథలో ముఖ్యమైన మలుపు తీసుకురానుందని టాక్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, ఆగస్టు 21, 2026న వరల్డ్ వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read:Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక మలయాళంలో తెరకెక్కుతున్న పళ్లి చట్టంబిలో కూడా కయాదు లోహార్ కీలక పాత్రలో కనిపించనుంది. టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని కలిగిస్తోంది. యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథతో పాటు, 1950ల కేరళ రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఆమె ప్రెజెన్స్‌ను ఎలా నిలబెడుతుందో చూడాలి. కయాదు లోహార్ లైనప్‌లో మరో ప్రాజెక్ట్ ఐ యామ్ గేమ్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కయాదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే కాకుండా… తెలుగు లో ఇమ్మోర్టల్ సినిమాలో G. V. ప్రకాష్ కుమార్ సరసన కూడా కనిపించనుంది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ, కయాదు లోహార్ తన కెరీర్‌ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!