Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”

Kayadu Lohar

Kayadu Lohar, Kayadu Lohar Marriage, Kayadu Lohar Single,

సాధారణ తెలుగు మాట్లాడటం ఎలాగోలా నెట్టుకొచ్చినా, ‘ది ప్యారడైజ్’లో వాడిన స్వచ్ఛమైన తెలంగాణ స్లాంగ్ తనకి ఏమాత్రం పలకలేదని, ఎంత ప్రయత్నించినా అది అసాధ్యంగా (ఇంపాజిబుల్) మారడంతో చివరకు డబ్బింగ్‌ను విరమించుకోవాల్సి వచ్చిందని స్వయంగా హీరోయిన్ ఒప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. .

సాధారణంగా పరభాషా కథానాయికలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తారు. అయితే నాని సరసన ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి (సుబ్బు) పాత్ర పోషించిన కయాదు లోహర్ మాత్రం తెలంగాణ యాస ముందు చేతులెత్తేసింది. సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, కథకు అవసరమైన తెలంగాణ మాండలికం స్థాయికి తన యాస ఏమాత్రం సెట్ అవ్వ లేదని ఆమె స్పష్టం చేసింది. సాధారణ తెలుగును నేర్చుకోవడం సులభమే అయినా, నేటివిటీ ఉట్టిపడేలా పక్కా తెలంగాణ స్లాంగ్ పలకడం తనకు అసాధ్యంగా మారిందని చెప్పింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం ఒకసారి ప్రయత్నించి చూద్దామని ప్రోత్సహించినప్పటికీ, చివరకు ఆ యాసను అందుకోలేక డబ్బింగ్ నిర్ణయాన్ని పక్కన పెట్టేసినట్లు ఆమె వెల్లడించింది.