Site icon NTV Telugu

భార్యాభర్తలుగా కత్రినా-విక్కీ.. మొదటి వెడ్డింగ్ ఫోటో వైరల్

vicky-katrinaa

vicky-katrinaa

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా మారారు. నేడు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్‌ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో విక్కీ, కత్రినా మెడలో తాళికట్టాడు. ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు అధికారికంగా బయటకి రాలేదు.. తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తన వివాహం జరిగినట్లు ప్రకటించింది. కత్రినా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త జీవితానికి పునాది.. అందరు తమ జంటను ఆశీర్వదించాలని కోరింది.

కత్రినా రెడ్ కలర్ సబ్యసాచి లెహెంగాలో పెళ్లికూతురిగా ముస్తాబు కాగా.. ఆమెకు తగ్గట్టే విక్కీ కూడా క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో రాయల్ గా కనిపించాడు. ఇక ఈ జంటను ఆలా చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఇక కొత్త జంటకు ప్రముఖులతో సహా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు.

https://www.instagram.com/p/CXQ6mwTh4HR/

Exit mobile version